గుంటూరు (అక్షర ప్రళయం)
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ షేక్ సిరాజుద్దీన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని సిరాజుద్దీన్ ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండగ ప్రతీ ఇంట్లో సుఖ, సంతోషాలను నింపాలని భగవంతుని ప్రార్థించారు.