మూర్చ వ్యాధి పట్ల అపోహలు వీడాలి

  • ఏ ఎం సీ ప్రిన్సిపాల్ డాక్టర్ బుచ్చి రాజు

మహారాణి పేట (అక్షర ప్రళయం)

ప్రజలు మూర్చ వ్యాధి పట్ల వున్న అపోహలు, అనుమానాలు తొలగించుకోవాలి అని ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బుచ్చి రాజు
కోరారు. ఆయన  శుక్రవారం ఆంధ్రా మెడికల్ కళాశాల లో జరిగిన సీ ఏం ఈ కార్యక్రమంను ముఖ్య  అతిథిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశంలో ఏటా మూర్చ రోగ వారోత్సవాలు జరుగుతున్నాయి అని గుర్తు చేశారు. ఇందులో భాగంగా న్యూ రాలజీ విభాగం ఆధ్వర్యంలో సిఎంఈ కార్యక్రమం జరుగుతుంది అన్నారు. రెండు శాతం ప్రజలు మూర్చ వ్యాధితో బాధపడుతున్న ట్టు తెలిపారు. బాధితులు పట్ల కుటుంబ సభ్యులలో
మూడ నమ్మకాలు ఉన్నాయి అని విచారం వ్యక్తం చేశారు.మేజర్,  మైనర్ మూర్చ వ్యాధులు వున్నాయి. 90 శాతం నివారణ అవుతాయి అన్నారు. ఈ వ్యాధికి రెండు దశాబ్దాలుగా 30 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. ఇది మెదడు కి సంభందించిన వ్యాధి అన్నారు.కేజీ హెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్
డాక్టర్ రవి మాట్లాడుతూ, మూర్చ వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవాలి అన్నారు. ఎండోక్రినాలజీ  విభాగాధిపతి డాక్టర్ కే.ఏ.వీ. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మూర్చ వ్యాధి నివారణ మీద ప్రజలు అవగాహన పెంచుకోవాలి అన్నారు.కేజీ హెచ్ న్యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఎస్. గోపి మాట్లాడుతూ, జాతీయ మూర్చ దినోత్సవం ఏటా నవంబర్ 17 వ తేదీన జరుగుతుంది అన్నారు.  దేశంలో ఈ దినోత్సవం 1991 నుంచి జరుగుతుంది అన్నారు. ప్రపంచంలో 12 కోట్ల మంది మూర్చ వ్యాధి బాధితులు వుండగా,  భారత దేశంలో 70 మిలియన్ల మంది వరకు ఉన్నారు అని తెలిపారు. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో పలు అపోహలు వున్నాయి. మూర్చ వుంటే వివాహం చేయకూడదు అని అనుకుంటారు. అది సరికాదు అన్నారు. అది అపోహ మాత్రమే అన్నారు. కాగా,30 రకాల మూర్ఛ వ్యాధులు వున్నాయి. నవ్వుకోవడం కూడా ఇందులో ఒక రకం. ఈ రోగుల్లో నిరాశ, ఆందోళన, నిస్పృహ కూడా కనిపిస్తాయి. ప్రజల్లో చైతన్యం పెంచడానికి అవగాహన కార్యక్రమంలు నిర్వహిస్తున్నాం. ఈ వ్యాధిని 21 రోజుల్లో నయం చేసే మందులు వున్నాయి. వంశ పారంపర్యంగా కూడా వస్తుంది. కొత్త మందులు వచ్చాయి. రెండు సంవత్సరాలు మందులు వాడాల్సి ఉంటుంది అన్నారు. న్యూరో సర్జరీ డాక్టర్
ప్రేమ్ జిత్ రే, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *