ప్రదానోపాధ్యునికి షోకాజ్ నోటీస్..!
ఇంచార్జ్ ఉప సంచాలకులు రజని
పాడేరు (అక్షర ప్రళయం)
హుకుం మండలం మెరకచింత ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాటశాల డిప్యూటీ వార్డెన్ ఎం.పి కోటేశ్వర రావును సస్పెండ్ చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ ఇంచార్జ్ ఉప సంచాలకులు ఎల్.రజని ఉత్తర్వులు జారీ చేసారు. అదేవిధంగా అదే పాటశాలలో ప్రదానోపాధ్యయురాలుగా పని చేస్తున్న ఎస్. శాంత కుమారికి షోకాజ్ నోటీస్ జారీ చేసారు. వివరాలలోకి వెళ్తే… 15వ తేదీ అర్ధ రాత్రి పాతశాలకు చెందిన 20 బస్తాల బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా బాకూరు గ్రామస్తులు పట్టుకుని సీజ్ చేయడం జరిగింది. శనివారం ఉదయం విషయం తెలుసుకున్న ఇంచార్జ్ ఉప సంచాలకులు నేరుగా వెళ్లి విచారణ జరపగా ఆ బియ్యం మెరకచింత పాతశాలకు చెందినవిగా గుర్తించి ప్రాధమిక విచారాణ ప్రకారం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేక్ సూచనల మేరకు డిప్యూటీ వార్డెన్ ను సస్పెండ్ చేయడంతో పాటు హెచ్ఎం ను సంజాయషీ కోరినట్లు ఎల్, రజని తెలిపారు.పూర్తీ విచారణ అన౦తరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఆమె వివరించారు.