విశాఖపట్నం (అక్షర ప్రళయం)
సౌత్ ఇండియా కరాటే చాంపియన్ షిప్ పోటీలు
నేషనల్ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ (ఎన్.ఎస్.కె ఏ.ఐ) ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన ఎండాడలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ శాసనసభ్యులు వంశిక్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. టోర్నమెంట్ లో టైగర్ పవర్ క్లబ్ నుంచి 70 మంది పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ లో టైగర్ పవర్ క్లబ్ ఓవరాల్ ఛాంపియన్షిప్ మొదటి స్థానం దక్కించుకుంది. టోర్నమెంట్ కి న్యాయనిర్ణేతలు గా ప్రేమ్ కుమార్, టైగర్ పవర్ క్లబ్ టీం కోచ్ గా వెంకీ, సన్నీ, టీమ్ మేనేజర్ గా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు అని టైగర్ పవర్ క్లబ్ అధ్యక్షులు గంట నూకరాజు ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు, కరాటే ప్రియులు తదితరులు పాల్గొన్నారు.