యానాం (అక్షర ప్రళయం)
శెట్టిబలిజ నవయుగ వెల్ఫేర్ అసోసియేషన్ యానాం మరియు గణపతి నగర్ నక్కల చిన్నపైడియ్య, పంపన సూర్యనారాయణ ఆధ్వర్యంలో యానాం మెట్టకూరు బైపాస్ లో వేంచేసియున్న శ్రీ నేరేలమ్మ ఆలయంవద్ద ఘనంగా కార్తీక వన సమారాధన నిర్వహించారు.ఈ కార్యక్రమంనకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్,జన సేన నాయకులు కుడుపూడి శివన్నారాయణ పాల్గొన్నారు.
ఈసందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ శెట్టిబలిజలు సోదరులు అందరూ ఐక్యంగా ఉండాలని అందరూ సామాజికంగా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని పిలుపునిచ్చారు. కుడిపూడి శివన్నారాయణ మాట్లాడుతూ శెట్టి బలిజలు అందరు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కలిసి- మెలిసి అభివృద్ధి సాధించాలని కార్తీక వన సమారాధన ద్వారా సంఘీయులలో ఐక్యత పెరుగుతుందని తద్వారా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలోపేతం అవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నక్కల సుబన్న,గుబ్బల లక్ష్మణరావు, నక్కల రామారావు,నక్కల సత్యనారాయణ,కాకి నాగేశ్వరావు,పంపన దుర్గారావు మరియు ఆలయ కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.