యానాం (అక్షర ప్రళయం)
యానాం తెలగా(కాపు) అభ్యుదయ సంఘం ఆధ్వర్యం లో నిర్వహించిన కార్తీక మాస వన సమారాధన మహోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వన సమారాధన మహోత్సవములో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాట్లాడుతూ కాపు కులస్థులు ఓకే తాడిపై ఉంటూ కులానికి అన్ని విధాల సహాయ కార్యక్రమాలు చేయాలని అంతేకాకుండా కాపులలో కూడా అనేక మంది పేదవారు కూడా ఉన్నారు.అలాంటి వారికి మనం చేయుతగా ఉండాలని.పిలుపునిచ్చారు.ఈ రోజు నేను ఈ స్థాయిలో ఒక శాసన సభ్యుడుగా మీ ముందు ఉన్నాను అంటే కేవలం కాపు కులంతో పాటు మిగిలిన కులాలు కూడా నాకు ఈ స్థానాన్ని కల్పించారు. కాపులతో పాటు మిగిలిన అన్ని కులాలని కలుపుకుని మనం అందరం సోదర భావంతో పని చేసుకుంటూ ముందుకు సాగాలని అంతేకాకుండా మా నాన్న గారు గొల్లపల్లి గంగాధర్ ప్రతాప్ యొక్క ఆశయాలు కి అనుగుణంగా నేను పనులు చేసుకుంటా వెళ్తానని ప్రతి యొక్క పేదవాడికి కుల మత భేదాలు చూడకుండా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తానని సభా ముఖంగా తెలిపారు. అంతేకాకుండా కాపులు యొక్క అభ్యుదయానికి ఎంతో మంది నాయకులు పోరాటాలు చేశారు అని ముఖ్యంగా వంగవీటి మోహన రంగా, కామిశెట్టి పరుశురాం, గంగాధర్ ప్రతాప్, మరియు వినాయకరావు ఇలా అనేక మంది ఉన్నారు ఇక ముందు కూడా సంఘం అభివృద్ధికి మరింత మంది పెద్దలు ముందుకు వచ్చి ముందుకు తీసుకెళ్ళాలని కోరారు.ఈ వన సమారాధన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గౌరవ అధ్యక్షుడు నల్లా వెంకన్న, రాంముర్తి, ఉపాధ్యకుడు చిక్కాల నరసింహ మూర్తి, కొన సుబ్బారావు, సెక్రటరీ చెక్కల అరుణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ గుండబత్తుల ప్రసాద్ నాయుడు,ఎన్.వి.వి.ఎస్.రత్న నాయుడు. ట్రెజరర్ బొంగరాల కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు.