నల్ల మారమ్మ పండుగ,కీర్తిశేషులు మల్ల శివ సత్యనారాయణ జ్ఞాపకార్థం వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు..
న్యూస్ డెస్క్ (అక్షర ప్రళయం)
శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ వారు జి.కోడూరు, నర్సీపట్నంలో నల్ల మారమ్మ పండుగ సందర్భంగా మరియు సంఘ సేవకులు స్వర్గీయ మల్ల. శివ సత్యనారాయణ జ్ఞాపకార్థం జి కోడూరు పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అప్పారావు మాట్లాడుతూ, జి కోడూరులో స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రతిష్టించి, వివేకానంద ఆశయంతో మానవసేవే- మాధవ సేవ దిశగా ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని, ఈ సంవత్సరం నల్ల మారమ్మ పండుగ సందర్భంగా, మరియు మహోన్నత వ్యక్తి శివ సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ముఖ్య సభ్యులుP. ఈశ్వరరావు మరియు సంస్థ సభ్యులు సత్తిబాబు మొదలైన వారు పాల్గొన్నారు.