- రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ కొచ్చిన్ లో అందజేసిన అవార్డు..
-36 ఏళ్ల పర్యావరణ కృషి అభినందనీయం - పచ్చదనం పరిడవిల్లాలి..
- స్టీఫెన్ యుర్చిక్, అధ్యక్షురాలు రోటరీ ఇంటర్నేషనల్ ..
న్యూస్ డెస్క్ (అక్షర ప్రళయం)
ఎకో వారియర్ రత్నానికి ఎన్విరాన్మెంటల్ చేంజ్ మేకర్ జాతీయ పురస్కారం రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ అధ్యక్షురాలు స్టీఫెన్ యుర్చిక్ ఆదివారం ఉదయం అందజేశారు. ఈ మేరకు కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ లోని రోటరీ సంస్థ మూడోవ రోజు మూడవ రోజు కార్యక్రమంలో జాతీయ అవార్డును అందజేశారు. 36 ఏళ్ల పర్యావరణ కృషి అభినందనీయం అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం విభిన్న రకాలుగా కృషి చేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి నిత్యం కృషి చేసిన వ్యక్తిగా తమ జ్యూరీ సభ్యులు గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం ను గుర్తించారు అన్నారు. ఈ కృషి నిరంతరం ముందుకు సాగాలి అని కోరారు. పచ్చదనం పరిడవిల్లేందుకు రోటరీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా కృషి చేయడం జరుగుతుంది అని, అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నవారిని ప్రోత్సాహిస్తోంది అని పేర్కొన్నారు. క్లైమేట్ చేంజ్ నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సీడ్ బాల్స్ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించవలసిన అవసరం ఏర్పడింది అన్నారు. అంతర్జాతీయంగా తమ సంస్థ అందచేస్తున్న కార్యక్రమాలు ఆమె వివరించారు.ఈ కార్యక్రమంలో రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నామినీ సంఘ్ కో యున్, రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కన్వీనర్ అనిరుధ్ రోయ్ చౌదరి , రోటరీ ఇంటర్నేషనల్ కాబోయే డైరెక్టర్ మురుగు నందన్, మునుపటి గవర్నర్ సందీప్ అగర్వాల్, జ్యూరీ సభ్యులు మాట్లాడారు. అజయ్ గుప్త, రాజమోహన్ నాయర్, సౌరబ్ సొన్వాలా తదితరులు పాల్గొన్నారు