రూ.10 వేల ఆర్థిక సాయం
అధ్యక్షులు విన్నకోట సురేష్
రూ.4 వేలు అందించిన విద్యుత్ ఏఈ
బాపట్ల (అక్షర ప్రళయం)
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు అఖండ ఫౌండేషన్ అండగా నిలిచింది. కొండంత కష్టంలో నిలిచిన వారికి తోడుగా ఉంటామంటూ ముందుకు వచ్చింది. బాపట్ల ఉప్పరపాలెం ఆరో వార్డులో ఈ నెల 6న విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాద సమయంలో బాపట్ల మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉండటంతో ఆ కార్యక్రమానికి తన కూతురి తోపాటు తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఈ సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఏమినేని శ్రీనివాసరావు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూరి ఇల్లు పూర్తిగా దగ్ధమవడంతోపాటు ఇంటిలోని సామగ్రి, అలాగే పదవ తరగతి చదువుతున్న కుమారుడు సర్టిఫికెట్లు పూర్తిగా కాలిపోయాయి. అలాగే ఇంట్లో ఉన్న సామాన్లు ఇండియన్ గ్యాస్ సిలిండర్లు కూడా అగ్నికి పేలిపోయాయి, దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆ కుటుంబానికి కొండంత ఆసరాగా నిలబడి సోమవారం అఖండ పౌండేషన్ సభ్యులు బాధిత కుటుంబం వద్దకు వెళ్లి 10 వేల రూపాయల ఆర్థిక సాయం అలాగే దుప్పట్లను అందించారు. వీరితోపాటు బాపట్ల పట్టణ విద్యుత్ ఏఈ సాయి శ్రీనివాసరావు రూ.4 వేలు బాధితత కుటుంబానికి అందించి తమ ఉదారత చాటుకున్నారు. ఈ సందర్భంగా అఖండ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు జివిఎల్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ; ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారికి తగిన న్యాయం చేస్తానని తెలిపారు.. ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ మాట్లాడుతూ; ఈ ప్రమాదం చాలా బాధాకరం, ఇటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రతి ఒక్కరు చెయ్యి చెయ్య కలుపుకొని ముందుకు వెళ్లి సాయం చేయాలని అన్నారు. మేము చేసిన సాయం చిన్నదే కావచ్చు శ్రీరాముడు కి ఉడత సాయం ఎలాగో వారికి కూడా కష్టకాలంలో ఉన్నవారికి కొండంత ధైర్యంగా ఉంటుందని ఫౌండేషన్ తరపున 10, వేలు ఆర్థిక సాయం చేయడం అలాగే విద్యుత్ శాఖ పట్టణ ఏయి సాయి శ్రీనివాస్ స్పందించి 4000 ఆర్థిక సాయం చేయడం చాలా గొప్ప విషయమని అలాగే దాతలు ముందుకు వచ్చి వారికి సాయం చేయాలని ఆయన అన్నారు… ఈ కార్యక్రమంలో అఖండ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వంగపాటి శివ, ఫౌండేషన్ సభ్యులు చేజర్ల సతీష్, నాగరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.