తాళ్ళరేవు (అక్షర ప్రళయం)
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్ళరేవు డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ గా భాస్కరరాజు ఉపాధ్యక్షులు గా మొగలతుర్తి శ్రీనివాసరావు మంగళవారం ఉదయం ఇంద్రపాలెం ఇరిగేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఎన్నికలలో వేగేశ్న భాస్కరరాజును- మొగలతుర్తి శ్రీనివాసరావు ను మిగిలిన నీటి సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ (బాబి) ఇరువురుని కలిసి అభినందించి ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులపై ప్రత్యేకశ్రద్ధ పెట్టి సాగునీరుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాళ్వా సాగు చేపట్టేలా ఈ కమిటీ చర్యలు తీసుకోవాలని కోరారు. ముమ్మిడివరం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు సహాయసహకారాలు తో పంటకాలువలు ఆధునీకరణ చేయించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో టేకుమూడి లక్ష్మణరావు,గుత్తుల వెంకటరమణ, నడింపల్లి వినోద్,ధూళిపూడి సుబ్బారావు,పిల్లి సత్తిబాబు,దొమ్మేటి లోవరాజు, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు చిట్టూరి నాగు,విళ్ళ వీర, ధూళిపూడి గోవిందరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.