అట్టహాసంగా ప్రారంభమైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

35 వ వార్డు కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వేడుకలు

రెండు రోజుల ముందుగానే ఎమ్మెల్యే వంశీ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

అభిమానులు , కూటమి శ్రేణులు సమక్షంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే

విశాఖ దక్షిణం, (అక్షర ప్రళయం)

35 వ వార్డులో గల మున్సిపల్ స్టేడియం ఎదురుగా వున్న కళ్యాణ మండపంలో జరిగిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస జన్మదిన వేడుకలు 35 వార్డ్ కూటమి శ్రేణులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ శ్రీనివాస్ ప్రసంగిస్తూ గత ఎన్నికలలో దక్షిణ నియోజకవర్గంలో 35 వార్డు నుంచి అత్యధిక మెజార్టీ చేకూర్చిన 35 వార్డుని ఎన్నడు మరువలేనని గుర్తు చేశారు . వార్డ్ లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు గుర్తుండిపోయే విధంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అనంతరం అభిమానులు కూటమి శ్రేణులు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చివరగా అభిమానులు , టీడీపీ, జనసేన, బిజెపి నాయకులతో కలిసి విందులో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్థానిక కార్పొరేటర్, వార్డ్ కూటమి అధ్యక్షులు ,మాజీ కార్పొరేటర్ లు, సీనియర్ నాయకులు, పెద్దలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు….

విశాఖ దక్షిణం, (అక్షర ప్రళయం)

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *